Etthara Jenda

Ramajogayya Sastry

పరాయి పాలనా పై కాలు దువ్వి
కొమ్ములు విదిలించిన కోడెగిత్తల్లాంటి అమరవీరుల్ని తలుచుకుంటూ

నెత్తురు మరిగితే
ఎత్తర జెండా
సత్తువ ఉరిమితే
కొట్టర కొండా
నెత్తురు మరిగితే
ఎత్తర జెండా
సత్తువ ఉరిమితే
కొట్టర కొండా

ఏయ్ జెండా కొండా కత్తి సుత్తి
గిత్త కోత కొమ్ము కోడే
వంచలేని కోడె
ఒంగోలు కోడే
సిరిగల కోడే
సిరిసిల్ల కోడే
ఎల్ల ఎల్ల కోడే
ఎచ్చయిన కోడే
రాతికన్న గట్టిదీ రాయలసీమ కోడే

నెత్తురు మరిగితే
ఎత్తర జెండా
సత్తువ ఉరిమితే
కొట్టర కొండా

ఉరుము ఉరుము ఉరుము ఉరుము
ఉరుమురుమురు ఉరుమురుమురు
మురుమురుమురుమురుమురుమురు
ఉరుమురుమురుమురుమురుమురుమురు

నెత్తురు మరిగితే
ఎత్తర జెండా
సత్తువ ఉరిమితే
కొట్టర కొండా

రయ్యా రయ్యా రక్తంలే లెమ్మనే
దమ్ము దమ్ము గుండెలకేగ తన్నేనే
ఉక్కు నరం బిర్రు బిర్రు బిగిసెనే
అరె సిమ్మా సీకటి ముప్పంతా ముగిసేనే
ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడు ఆడాలా
డప్పుల మేళాలు మహా గొప్పగా మోగాలా
మోత
కూత
కొత్త
కోట
తూట
వేట
తురుము
కోడే

కసిగల కోడే
కలకత్తా కోడే
గుజ్జుగల కోడే
గుజరాతి కోడే
కత్తిలాంటి కోడే
కిత్తూరు కోడే
తిరుగేలేనిది తిరునల్వేలి కోడే

నెత్తురు మరిగితే
ఎత్తర జెండా
సత్తువ ఉరిమితే
కొట్టర కొండా

చుట్టూ చుట్టూ
చుట్టూ చుట్టూ
చుట్టూ చుట్టూ
చుట్టూ చుట్టూ
చుట్టూ చుట్టూ చుట్టూ చుట్టూ
చుట్టూ చుట్టూ చుట్టూ చుట్టూ
చుట్టూ చుట్టూ చుట్టూ చుట్టూ
చుట్టూ చుట్టూ చుట్టూ చుట్టూ

చుట్టారా చుట్టూ తలపాగా చుట్టరా
పట్టర పట్టు పిడికిలి బిగపట్టరా
జబ్బలు రెండు చరిచి జై కొట్టారా
మన ఒక్కో గొంతు కోట్లాది బెట్టురా
చూడరా మల్లేశా చుట్టమైనది భరోసా
కుమ్మర గణేశా కూడగట్టారా కులాసా
అస్స బుస్స గుట్ట గిట్ట
గింజ గుంజ కంచు కోడే (ਬੱਲੇ ਬੱਲੇ ਬੱਲੇ ਬੱਲੇ ਬੱਲੇ)

పంతమున్న కోడే
పంజాబి కోడే
తగ్గనన్న కోడే
టంగుటూరి కోడే
పౌరుషాల కోడే
పల్లాస్సి కోడే
విజయ విహారమే వీర మరాఠ కోడే

నెత్తురు మరిగితే
ఎత్తర జెండా
సత్తువ ఉరిమితే
కొట్టర కొండా

వాడు వీడు ఎవడైతే ఏందిరా
నీది నాది మనదే ఈ జాతర
దిక్కులనిండ దివిటీల దొంతర
దద్దారిల్లే దరువై శివమెత్తరా
వెయ్యరా తండోరా వెళ్లి చెప్పారా ఊరూరా
వేడుకలొచ్చెనురా వేల కన్నుల నిండారా
అది అది లెక్క
అదరాలి ఢంకా
తాళమేసి ఆడు
తయ్యాతైతక్క
చెంగనాలు తొక్కనే
చంద్రుళ్ళో జింక
నేలమీద వాలగా ఆకాశంలో చుక్క

నెత్తురు మరిగితే
ఎత్తర జెండా
సత్తువ ఉరిమితే
కొట్టర కొండా
నెత్తురు మరిగితే
ఎత్తర జెండా
సత్తువ ఉరిమితే
కొట్టర కొండా

ఉరుము ఉరుము ఉరుము ఉరుము
ఉరుమురుమురు ఉరుమురుమురు
మురుమురుమురుమురుమురుమురు
ఉరుమురుమురుమురుమురుమురుమురు

Wissenswertes über das Lied Etthara Jenda von Vishal Mishra

Wer hat das Lied “Etthara Jenda” von Vishal Mishra komponiert?
Das Lied “Etthara Jenda” von Vishal Mishra wurde von Ramajogayya Sastry komponiert.

Beliebteste Lieder von Vishal Mishra

Andere Künstler von Film score